Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

KGBV : కేజీబీవీలో  ప్రవేశాలకు, బోధనా సిబ్బంది కొరకు దరఖాస్తుల ఆహ్వానం..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సరికొత్తగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళా ఆరోగ్య కార్యకర్త) కోర్సును ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పాఠశాల ప్రత్యేక అధికారిణి డి. విజయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

KGBV : కేజీబీవీలో  ప్రవేశాలకు, బోధనా సిబ్బంది కొరకు దరఖాస్తుల ఆహ్వానం..!

సరికొత్తగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు ప్రారంభం..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సరికొత్తగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళా ఆరోగ్య కార్యకర్త) కోర్సును ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పాఠశాల ప్రత్యేక అధికారిణి డి. విజయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని పేర్కొన్నారు. కేవలం 40 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున, ఆసక్తి గల విద్యార్థినులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ కోర్సును బోధించడానికి తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ఒక మహిళా గెస్ట్ అధ్యాపకురాలి పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

నర్సింగ్ విభాగంలో ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యా అర్హత లేదా బీఎస్సీ నర్సింగ్ తో పాటు 10 సంవత్సరాల పని అనుభవం ఉన్న మహిళా అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.అర్హత మరియు ఆసక్తి గల మహిళలు ఈ నెల జులై 9వ తేదీ లోగా గుర్రంపోడు కస్తూర్బా పాఠశాలలో నేరుగా తమ దరఖాస్తులను అందజేయాలని ప్రత్యేక అధికారిణి విజయశ్రీ ఈ సందర్భంగా తెలిపారు

మరిన్ని వార్తలు