Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Hyderabad : మాదాపూర్, మియాపూర్ డివిజన్ లలో రూ.4.49 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన..!

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.

Hyderabad : మాదాపూర్, మియాపూర్ డివిజన్ లలో రూ.4.49 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన..!

శేరిలింగంపల్లి, మన సాక్షి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్, మాదాపూర్ డివిజన్ల పరిధిలో రూ.4 కోట్ల 49 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో రూ.82.00 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్,నార్నె శ్రీనివాస్ రావు లతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ, అయ్యప్ప సొసైటీ కాలనీలలో రూ.3 కోట్ల 67 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు.సందర్బంగావారు మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

సీసీ రోడ్లు, వరద నీటి కాల్వల నిర్మాణంతో స్థానికుల రాకపోకలకు సౌలభ్యం ఏర్పడటంతో పాటు వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మరిన్ని వార్తలు