Ramagundam : సుందర నగరంగా రామగుండం.. తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి..!
రామగుండం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు.

Ramagundam : సుందర నగరంగా రామగుండం.. తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి..!
గోదావరిఖని, మన సాక్షి :
రామగుండం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళ వారం ఉదయ్ నగర్, పవర్ హౌజ్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కంకణాల మౌనిక తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చే క్రమంలో గత ఐదు నెలలుగా డ్రైనేజ్ లలో పూడిక తీత కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతున్నదని అన్నారు . నగర పాలక సంస్థ ఆద్వర్యంలో ఒక ప్రక్క కాలువలలో పూడిక పూడిక తీత కార్యక్రమం చేపడుతుంటే మరో ప్రక్క అదే కాలువల్లో చెత్త వేస్తుండడంతో యధావిధిగా తయారవుతున్నదని అన్నారు .
చెత్త వేయవద్దని ఇన్నాళ్ళూ అవగాహన కల్పించామని ఇక జరిమానాలు విధించక తప్పదని అన్నారు. కేవలం రూ 50/- చెల్లిస్తే నెల రోజుల పాటు ఇంటి ముందుకే వచ్చి చెత్త తీసుకెళ్ళే అవకాశం ఉండగా రోడ్లపై , నాలాల్లో వేయడం సరికాదని అన్నారు . స్వచ్చ రామగుండంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోక పోవడంతో బొందల గడ్డ గా మారిన నగరాన్ని నవ నిర్మాణం చేస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్న ఎం ఎల్ ఎ రాజ్ ఠాకూర్ కు సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డి .ఇ .ఇ శ్రీకాంత్ , ఎ ఇ తేజస్విని , టి పి ఎస్ నవీన్ , సానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం , జూనియర్ అసిస్టెంట్ చంద్రా రెడ్డి , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , సానిటరీ జవాన్ సోమేష్ , వాటర్ సప్లయ్ సూపర్వైజర్ శశి కుమార్ , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.









