Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ సిబ్బంది జల ప్రతిజ్ఞ..!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్యాచ్ ది రైన్ ఉద్యమంలో భాగంగా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జల ప్రతిజ్ఞ చేశారు.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ సిబ్బంది జల ప్రతిజ్ఞ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్యాచ్ ది రైన్ ఉద్యమంలో భాగంగా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జల ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోనే వర్షపు నీటి నిల్వ గుంతలను నిర్మించనున్నట్లు కమిషనర్ శ్రీజారెడ్డి ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
మారుతున్న వాతావరణ పరిస్థితులు, సిమెంట్ రోడ్ల కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వృధాగా పోతోందని,భవిష్యత్తులో రాబోయే నీటి ఎద్దడిని అరికట్టడానికి ప్రతి ఇంట్లోనూ వర్షపు నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, మన అందరి కర్తవ్యం. మిర్యాలగూడను జల సమృద్ధి గల పట్టణంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, మీడియా, పౌరులు భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడ వర్షం కురిస్తే అక్కడ.. ఎప్పుడు కురిస్తే అప్పుడు ఆ నీటిని భూమిలోకి మళ్లించేలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని కోరుతున్నామన్మారు.
MOST READ :
- Video : ట్రైన్ లేదని.. ఏకంగా ఆర్టిసి బస్సునే ఎత్తుకెళ్లాడు.. తెలంగాణలో వింత ఘటన.. (వైరల్ వీడియో)
- Urea Booking : రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్ ఇక ఈజీ.. యాప్ లో మార్పులు చేసిన వ్యవసాయ శాఖ..!
- District Collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఓటర్ల సందేహాల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు..!
- Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు వేదికల్లో లైవ్ తిలకించిన రైతులు..!









