డాక్టర్ రంగు ముత్యం రాజుకు ఊట్కూరు లో ఘనంగా సన్మానం..!
ఇటీవల ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం నుండి ఉద్యానవనం, దైవత్వం, ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్న సందర్బంగా డాక్టర్.రంగు ముత్యం రాజు స్వాతి దంపతులకు శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో చిన్న నాటి మిత్రులు ఆత్మీయ సన్మానం చేశారు.

డాక్టర్ రంగు ముత్యం రాజుకు ఊట్కూరు లో ఘనంగా సన్మానం..!
సూర్యాపేట, మనసాక్షి :
ఇటీవల ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం నుండి ఉద్యానవనం, దైవత్వం, ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్న సందర్బంగా డాక్టర్.రంగు ముత్యం రాజు స్వాతి దంపతులకు శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో చిన్న నాటి మిత్రులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్బంగా పలువురు శాలువా, పుష్ప గుచ్చాలతో సన్మానించి మెమెంటోలు బహుకరించారు.
ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ చిన్న నాటి నుండి ఆధ్యాత్మికత, సామాజిక సేవకార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ ప్రజల మన్ననలు పొందేవారని అన్నారు. గ్రామంలోని అందరిని కలుపుకొని పోతు పలు సేవా కార్యక్రమంలు ఎలా నిర్వహించాలో తెలిపేవారని అదే స్పూర్తితో
సూర్యాపేట పట్టణం లో ఆధ్యాత్మిక, సేవా, కార్యక్రమాలు నిర్వహిస్తూ గౌరవ డాక్టరేట్ పొందడం మా గ్రామానికి గర్వ కారణం అని అన్నారు.
ఈ కార్యక్రమం లోఉపసర్పంచ్ రంగు రాములు, కప్పల పార్థసారధి, కే నరసింహ చారి, శీలం కనకయ్య,ఎంపల్ల బిష్మా రెడ్డి, గుండ్ల శ్రీనివాస్, భూపతి సత్యనారాయణ, బ్రహ్మ చారి, కప్పల వెంకన్న, అయితగాని యాదగిరి, చంద్ర శేఖర్, అన్నేబోయన సైదులు, శీలం శ్రీను, రంగు జానయ్య, వీరయ్య, బిక్షంతో పూరి జగన్నాధం తో పాటు పలువురు పాల్గొన్నారు.










