Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లిస్తున్నావ్.. రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు ఇస్తున్నారు,వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు కాదు కదా, 17 స్థానాలు కూడా గెలవలేరని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.

Suryapet : తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లిస్తున్నావ్.. రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి..!

మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట, మనసాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు ఇస్తున్నారు,వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు కాదు కదా, 17 స్థానాలు కూడా గెలవలేరని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం పట్ల శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు.

ఏదైనా సభ జరిగితే తాము చేసింది, చేయాల్సింది, ఇచ్చిన హామీలు అమలు చేసినవి, చేయాల్సినవి చెప్పాలని, తప్ప సీఎం స్థాయిని మరచి బజారు వ్యక్తిలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అసలు కానేకాని డీలిమిటేషన్ లో 185 స్థానాలు అవుతాయని, అందులో తామే 119 గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

నీ దొంగ తెలివితేటలు ప్రజలకు అర్థమయ్యాయి. ఓడిపోతామనే భయంతో నువ్వు పడుతున్న ఫ్రస్టేషన్ ను ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే కేసీఆర్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రకు 100 టీఎంసీల నీళ్లు మళ్లించారని ఆరోపించారు.

కన్నెపల్లి నుంచి 2-3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి గండమల్ల వరకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, కేసీఆర్ కు పేరు వస్తుందనే మొండివైఖరితో పంప్ హౌస్ ను ఆన్ చేయడం లేదన్నారు. మేడిగడ్డకు నీళ్లు వస్తే రామాలయంతో పాటు లక్ష ఎకరాలు మునిగిపోతుందని చెప్పడం తగదన్నారు.
ఇప్పటికే ఆంధ్ర వాళ్లు 27 క్యూసెక్కుల నీటిని పోలవరానికి మళ్లించి, ప్రకాశం బ్యారేజీ నింపి కాలువల్లో నీళ్లు తీసుకెళ్తుంటే కళ్లు మూసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ పేరుతో తాను, తన మంత్రులు భూముల దోపిడీ చేసి రాహుల్ గాంధీకి పంపుతున్నారని, తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు.

బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డికి దేవుళ్ల మీద ఒట్టు వేయడం పరిపాటిగా మారిందని, భద్రాచలం రాములోరి మీద కూడా గతంలో ఒట్టు వేశారని అన్నారు. తెలంగాణలో 117 కాదు, 17 కూడా గెలవరని అన్నారు.
మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని, రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చని చెప్పినా నీళ్లు ఇవ్వడం లేదన్నారు.

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ, దేవుడి లాంటి కేసీఆర్ ను వదిలేసి రేవంత్ రెడ్డిని గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారని, రేవంత్ 3 ఏళ్ల పాలనలో ప్రజలు గోస పడుతున్నారని అన్నారు.

మాజీ జెడ్పీటీసీ జీడి. బిక్షం మాట్లాడుతూ, ఖమ్మంలో జరిగిన రేవంత్ రెడ్డి సభ “పిచ్చోడితో తిరునాళ్లకు పోయినట్టు” ఉందన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆంధ్రకు నీళ్లు ఇస్తూ తెలంగాణను ఎండబెడుతున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీరిచ్చి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో కొడంగల్ లో కూడా గెలవలేరని హెచ్చరించారు. మా నాయకులను మరోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణలో ప్రతి పర్యటనను అడ్డుకుంటామని, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టి తరుముతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు బండారు రాజా, శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు