Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు వేదికల్లో లైవ్ తిలకించిన రైతులు..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా, చింతకాని మండలం నుంచి రైతు భరోసా నిధులు 1009.15 కోట్ల రూపాయలు 1.44 లక్షల రైతులు ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది.

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు వేదికల్లో లైవ్ తిలకించిన రైతులు..!
మన సాక్షి, మిర్యాలగూడ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా, చింతకాని మండలం నుంచి రైతు భరోసా నిధులు 1009.15 కోట్ల రూపాయలు 1.44 లక్షల రైతులు ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా, మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని ఆధ్వర్యంలో సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు అందిస్తున్న వ్యవసాయ అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, ఏ ఈ ఓ లు పార్వతి, నాగయ్య , అఫ్రీన్, గోపి ,రైతులు ఇజ్రాయెల్, సురేందర్ రెడ్డి, కోటిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- Video : ట్రైన్ లేదని.. ఏకంగా ఆర్టిసి బస్సునే ఎత్తుకెళ్లాడు.. తెలంగాణలో వింత ఘటన.. (వైరల్ వీడియో)
- Urea Booking : రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్ ఇక ఈజీ.. యాప్ లో మార్పులు చేసిన వ్యవసాయ శాఖ..!
- Narayanpet : ఆ దొంగ టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మామూలోడు కాదు..!
- Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!










