Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

తెలంగాణలో దారుణం.. ఫోక్సో కేసులో బెయిల్ పై వచ్చిన నిందితుడు, బాలికతో సహా ఆరుగురి హత్య..!

తెలంగాణలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఫోక్సో కేసులో బెయిల్ మీద వచ్చిన నిందితుడు బాలికతో సహా ఆరుగురిని హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకుంది.

తెలంగాణలో దారుణం.. ఫోక్సో కేసులో బెయిల్ పై వచ్చిన నిందితుడు, బాలికతో సహా ఆరుగురి హత్య..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఫోక్సో కేసులో బెయిల్ మీద వచ్చిన నిందితుడు బాలికతో సహా ఆరుగురిని హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాబాద్ మండలం దైవలగూడ లో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్ (28) అనే వ్యక్తి పై మే 16వ తేదీన బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. కాగా మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిన్ననే బెయిల్ పై రాజ్ కుమార్ తిరిగి వచ్చాడు. బెయిల్ పై తిరిగి వచ్చిన అనంతరం కేసు పెట్టారని కక్షతో కేసు పెట్టిన బాలికతో పాటు బాలిక తల్లి, బాలిక నానమ్మలతోపాటు బాలిక తల్లి కుటుంబ సభ్యులని దారుణంగా హతమార్చాడు. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్లుగా సమాచారం. ఈ విషయం తెలిసిన పోలీసులకు రాజకుమార్ తల్లిదండ్రులు సమాచారాన్ని ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముందుగా బాలిక ఇంటికి రాజకుమార్ వచ్చాడని రాత్రి 11 గంటలకు బాలికను కారులో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలిక అమ్మమ్మ, నానమ్మలు వారించినప్పటికీ వినకుండా బాలికను రాజకుమార్ తీసుకెళ్లినట్లు సమాచారం. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు రాజకుమార్ బాలికను తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపినట్లు తెలుస్తుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురిని చంపేశాను నేను కూడా చనిపోతున్నాను.. హత్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి రాజకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది.

రహదారిపై బైఠాయించిన బంధువులు :

నిందితుడిని అప్పగించాలని బాలిక బంధువులు షాబాద్ – కంది రహదారిపై బైఠాయించారు. దాంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. షాబాద్ మండలం దైవాలగూడ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.

మరిన్ని వార్తలు