Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Breaking News : మన సాక్షి టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ | స్థానిక నుంచి అంతర్జాతీయ వార్తలన్నీ ఒకే చోట..!

మన సాక్షి వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలను అందిస్తున్నాం. స్థానిక, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న ప్రధాన పరిణామాలను ఒకే కథనంలో మీ కోసం అందిస్తున్నాం.

Breaking News : మన సాక్షి టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ | స్థానిక నుంచి అంతర్జాతీయ వార్తలన్నీ ఒకే చోట..!

మన సాక్షి డెస్క్ :

మన సాక్షి వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలను అందిస్తున్నాం. స్థానిక, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న ప్రధాన పరిణామాలను ఒకే కథనంలో మీ కోసం అందిస్తున్నాం.

తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం

తిరుమల అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి చిరుతపులి సంచరించడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. చిరుతను గుర్తించిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని శబ్దాలు చేస్తూ చిరుతను అడవిలోకి తరిమికొట్టారు.

——

బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన హత్యల బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని చేవెళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకోగా, పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

——

షాబాద్ హత్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు :

షాబాద్ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, బాధితురాలి తల్లిదండ్రులు నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కోరినా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమర్థంగా వాదించలేదని ఆరోపించారు. ఆ కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఇలాంటి నిందితులకు బెయిల్ మంజూరు చేయడం సమాజానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

——-

హైర్ బస్సులు బంద్.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

బస్సు ఆపలేదనే కారణంతో డ్రైవర్‌పై జరిగిన దాడికి నిరసనగా గుడివాడ డిపో పరిధిలోని 43 హైర్ బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ డిపో ఎదుట సిబ్బంది, సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వల్ల రద్దీ పెరిగిందని, డ్రైవర్లపై దాడులు చేయడం తగదని పేర్కొన్నారు.

——

రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు.. మంత్రి పొన్నంపై ఉత్తమ్ ప్రశంసలు :

రాష్ట్ర రవాణా శాఖలో పలు సంస్కరణలు అమలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.


కాలేశ్వరం ప్రాజెక్టు పై పొన్నం విమర్శలు 

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని, నిపుణులు పనులు నిలిపివేయాలని సూచిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ఇంకా రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

——-

షాబాద్ హత్య కేసు: CCTVలో నిందితుడి కదలికలు :

దైవాలగూడలో బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. అనంతరం బాలిక, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యల అనంతరం తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.

—–

అత్తమామలను కారుతో ఢీకొట్టిన అల్లుడు :

భార్యను కాపురానికి పంపడం లేదనే ఆగ్రహంతో గుంటూరుకు చెందిన రాజబాబు అనే వ్యక్తి తన అత్తమామలపై కారుతో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

——

థార్ కారుతో ATM దోపిడీ

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు మహీంద్రా థార్ వాహనం సహాయంతో ఇండియా వన్ ATMను బయటకు లాగి, అందులోని నగదును దోచుకుని పరారయ్యారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

——

షాబాద్ హత్య కేసులో నిందితుడి కారు గుర్తింపు

షాబాద్ హత్య కేసులో నిందితుడు రాజ్‌కుమార్ ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. నందిగామ వద్ద కారును వదిలి రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మరిన్ని వార్తలు