Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Ration Shops : రేషన్ దుకాణాల్లో ముక్కిపోతున్న బియ్యం.. ఎందుకు ఈ పరిస్థితి..! 

రేషన్ షాపుల్లో పిడిఎఫ్ బియ్యం ముక్కిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క షాపులో క్వింటాలకు కొద్ది బియ్యం పురుగుల పడిపోతున్నాయి. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత షాపులలో మిగిలిపోయిన దొడ్డు బియ్యం ఇప్పటివరకు వెనక్కు తీసుకోలేదు. దాంతో క్వింటాళ్ల కొద్ది బియ్యం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రేషన్ డీలర్లు ఉన్నారు. 

Ration Shops : రేషన్ దుకాణాల్లో ముక్కిపోతున్న బియ్యం.. ఎందుకు ఈ పరిస్థితి..! 

అనంతగిరి, మన సాక్షి :

రేషన్ షాపుల్లో పిడిఎఫ్ బియ్యం ముక్కిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క షాపులో క్వింటాలకు కొద్ది బియ్యం పురుగుల పడిపోతున్నాయి. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత షాపులలో మిగిలిపోయిన దొడ్డు బియ్యం ఇప్పటివరకు వెనక్కు తీసుకోలేదు. దాంతో క్వింటాళ్ల కొద్ది బియ్యం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రేషన్ డీలర్లు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల డీలర్ల సంఘం నాయకులు కోటయ్య ఆరోపిస్తున్నారు. శనివారం అయన మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నది.

సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పలువురు రేషన్ డీలర్లు వారు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ దుకాణాల్లోపాత దొడ్డు బియ్యం అలాగే ముక్కిపోతున్నాయి.

మండలంలోని 23 రేషన్ షాపులు ఉండగా నా వద్ద సుమారు 17 క్వింటాలు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. దొడ్డు బియ్యం నిల్వలు నెలల తరబడి పేరుకుపోయి పురుగులు పడి ముక్కిపోతున్నాయి. వర్షాలతో బియ్యం నిల్వలను భద్రపరచటానికి ఇబ్బంది పడుతున్నామన్నారు  మరో పక్క ఎలుకలు, పందికొక్కులు, లక్క పురుగుల బెడద ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరుకు గదులు ఉండటంతో తాజాగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం, పాతదొడ్డు బియ్యం కలిపి ఒకే చోట వేయాల్సి వస్తోందని, తెలిపారు. దొడ్డు బియ్యాన్ని త్వరగా వెనక్కి తీసుకోకుంటే దొడ్డిబియ్యం మరియు సన్న బియ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వాపోయారు. పాత బియ్యం తరిగిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలని రేషన్ డీలర్లు సంఘం నాయకులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు