Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsఅభివృద్దినల్గొండరాజకీయం

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి.. ప్రభుత్వ విప్ వేముల వీరేశం..!

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి.. ప్రభుత్వ విప్ వేముల వీరేశం..!

.30 లక్షలతో నిర్మించనున్న నూతన పద్మశాలి కమ్యూనిటీ భవనం కు శంకుస్థాపన

నకిరేకల్, మనసాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పద్మశాలి కమ్యూనిటీ భవనం మరియు డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పద్మశాలి సంఘం సభ్యులకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కమ్యూనిటీ భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తూ, నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల రాఘవ రెడ్డి, మురారిశెట్టి కృష్ణ మూర్తి, చౌగోని శ్రీనివాస్, గాజుల సుకన్య, గోలి పద్మ, సదానందం, చౌగోని లక్ష్మణ్, లక్ష్మి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు