Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

AP News : ఏపీలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం..!

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖలో భూకంపం వచ్చింది. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు తీశారు. సాగర తీరనగరం విశాఖపట్నంలో తెల్లవారు జామున ఒక్కసారిగా భూమి కంపించింది.

AP News : ఏపీలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖలో భూకంపం వచ్చింది. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు తీశారు. సాగర తీరనగరం విశాఖపట్నంలో తెల్లవారు జామున ఒక్కసారిగా భూమి కంపించింది. ప్రజల తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాలలో స్వల్ప భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5 నమోదయన్నట్లు అధికారులు వెల్లడించారు.

తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభయాలతో పరుగులు తీశారు. ఈ ప్రభావం విశాఖలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్పీ కాలనీ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలు పరిమితం కావడంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు