Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్య
KGBV : మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. కస్తూర్బాగాంధీ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మండల ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు.

KGBV : మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. కస్తూర్బాగాంధీ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మండల ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
ఆయన తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి, విద్యార్థుల అభ్యాస స్థాయిని, విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థులతో మాట్లాడారు.
మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పారిశుద్ధ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.