Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలురాజకీయం

ఆన్‌లైన్ సర్వర్లు డౌన్.. రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్..!

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు మరియు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను (హెల్ప్ డెస్క్‌లను) ఏర్పాటు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

ఆన్‌లైన్ సర్వర్లు డౌన్.. రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్..!

కరీంనగర్ వ్యాప్తంగా 10 ఉచిత సహాయ కేంద్రాల ఏర్పాటు..

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కేవలం 14 శాతం ఓటర్ సవరణ..

బి.ఎల్.ఓ ల సమన్వయ లోపంపై మండిపడ్డ ఎమ్మెల్యే గంగుల

జూలై 24లోగా పూర్తి చేయాలని పిలుపు..

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు మరియు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను (హెల్ప్ డెస్క్‌లను) ఏర్పాటు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో ఆదివారం కిసాన్ నగర్ తో పాటు చింతకుంటలో బి.అర్.ఎస్ ఏర్పాటు చేసిన ఎస్.ఐ.ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) సహాయ కేంద్రాలను మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ లతో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు బి.ఎల్.ఓ ల సమన్వయ లోపం వల్ల నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. జూలై 24 లోపు మిగిలిన ప్రక్రియను ముగించాల్సి ఉందని ఆన్‌లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

అందుకే బీఆర్‌ఎస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తోందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ కుమార్, మాజీ కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, కంసాల శ్రీనివాస్, మేచినేని అశోక్ రావు,ఐలెందేర్ యాదవ్, సుంకి శాల సంపత్ రావు నాయకులు నేతి రవివర్మ, మిడి దొడ్డి నవీన్,పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, కమల్ గౌడ్. ఆయా డివిజన్ల కు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు