Suryapet : ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడిగా మీలా మహదేవ్ ఎన్నిక..!
సూర్యాపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడిగా మీలా మహదేవ్ ఏకగ్రీవంగా మళ్లీ ఎన్నికయ్యారు.

Suryapet : ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడిగా మీలా మహదేవ్ ఎన్నిక..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడిగా మీలా మహదేవ్ ఏకగ్రీవంగా మళ్లీ ఎన్నికయ్యారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 నుండి 2028 వరకు 2 సంవత్సరములకు గాను పలువురు ఏకగ్రీవంగా మీలా మహదేవ్ ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట ఆర్యవైశ్య కళ్యాణ మండప మిగతా కమిటీ త్వరలో ఎన్నుకోనున్నట్లు తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయలతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నూతన నిర్మాణానికి సుధాకర్ పివిసి 10 లక్షల రూపాయల విరాళం, అనంతుల జనార్ధన్ కుటుంబ సభ్యులు 15 లక్షల రూపాయలు, మీలా మహదేవ్ కుటుంబ సభ్యులు 15 లక్షల రూపాయలు, ఆర్యవైశ్య కళ్యాణ మండప కమిటీ సభ్యులు 10 లక్షల రూపాయలు ఆర్ధిక సహకారం అందించినట్లు తెలిపారు.
ఇప్పటికే విద్యుత్తు అలంకరణ,ఏసీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో మిగతా పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేటలోని ఆర్యవైశ్యులందరూ మీ వివాహ శుభకార్యాలకు ఆర్యవైశ్య కళ్యాణమండపం ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం మాజీ ప్రధాన కార్యదర్శి లు కొత్త ఆంజనేయులు, రాచర్ల కమలాకర్, స్వామి బుచ్చయ్య, కమిటీ సభ్యులు గజ్జల జనార్ధన్ ,కుక్కడపు శ్రీనివాస్, స్థల దాతలు వెంపటి లక్ష్మీ కాంతారావు, కిరణ్, పూర్ణ చందర్, సబ్యులు గుడిపాటి నాగేశ్వరరావు, బ్రహ్మదేవర వెంకన్న, చల్లా సత్యనారాయణ, మొరిశెట్టి కోటేశ్వరరావు, బ్రాహ్మణపల్లి బాలచంద్రుడు, పబ్బా రామమూర్తి , మొరిశెట్టి కోటేశ్వరరావు, మీలా రమేష్ తదితరులు పాల్గొన్నారు.









