Hyderabad : ప్రేమ, వేధింపులు.. ఆపై దమ్ముంటే రా.. అని బెదిరింపు.. చివరికి మాదాపూర్ లో దారుణ హత్య..!
హైదరాబాదులోని మాదాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ, వేధింపులు హైదరాబాద్ కు దమ్ముంటే రా అనే బెదిరింపుతో మరింత రెచ్చగొట్టినట్లయితే.. దాంతో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Hyderabad : ప్రేమ, వేధింపులు.. ఆపై దమ్ముంటే రా.. అని బెదిరింపు.. చివరికి మాదాపూర్ లో దారుణ హత్య..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని మాదాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ, వేధింపులు హైదరాబాద్ కు దమ్ముంటే రా అనే బెదిరింపుతో మరింత రెచ్చగొట్టినట్లయితే.. దాంతో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
మాదాపూర్ లోని రామేశ్వరం కెఫె ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు యువకులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనలతో మాదాపూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ప్రాంతానికి చెందిన భాస్కర్ అనే యువకుడు ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు నమోదయింది. అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ మధ్యకాలంలో భాస్కర్ దమ్ముంటే హైదరాబాద్ కు రండి అంటూ సవాలు కూడా విసిరినట్లు సమాచారం..
దాంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చి పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయారు. దాంతోపాటు డయల్ 100 కు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటన స్థలంలో క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. అనంతరం భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివిధ కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు.