Suryapet : సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పై అధ్యయనం చేసిన సి ఆర్ బి బృందం..!
తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ సాగులో రైతులు అవలంబించిన ఉత్తమ పద్ధతులను డాక్యుమెంట్ చేయడానికి( సి ఆర్ బి) న్యూ ఢిల్లీ కి చెందిన సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ బృందం సభ్యులు సూర్యాపేట జిల్లాలో ని పెన్ పహాడ్ మండలం లో పర్యటించారు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పై అధ్యయనం చేసిన సి ఆర్ బి బృందం..!
సూర్యాపేట (పెన్ పహాడ్), మనసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ సాగులో రైతులు అవలంబించిన ఉత్తమ పద్ధతులను డాక్యుమెంట్ చేయడానికి( సి ఆర్ బి) న్యూ ఢిల్లీ కి చెందిన సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ బృందం సభ్యులు సూర్యాపేట జిల్లాలో ని పెన్ పహాడ్ మండలం లో పర్యటించారు. ఈసందర్బంగా వారు ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్న తూముల నవీన్, తూముల ఇంద్రాసేనా రావు తోటలను సందర్శించి పంట సాగులో రైతులు ఆలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటలుగా ఏ పంటలు పండిస్తున్నారని, రైతులకు ఎదురైనా సమస్యలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం లో సి ఆర్ బి సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు రజత్.సి, ప్రసిత. పి మల్లేశ్వర్ రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య, ప్రాంతీయ ఉద్యాన అధికారిని కే స్వాతి, విస్తరణ అధికారి రంగు ముత్యం రాజు, టీ జి ఆయిల్ ఫెడ్ మేనేజర్ అలీమ్ ఫిల్డ్ ఆఫీసర్ భవిష్య, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు మల్లేష్, అనిల్, నాగరాజు,తో పాటు పలువురు రైతులు ఉన్నారు.









