Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 38 వాహనాలు సీజ్..!

జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా పెంచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో బుధవారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 38 వాహనాలు సీజ్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా పెంచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో బుధవారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు.

మిర్యాలగూడ ఇంచార్జ్ డీఎస్పీ రవి పర్యవేక్షణలో 1 టౌన్ సీఐ నాగభూషణ్, 2 టౌన్ సీఐ సోమ నర్సయ్య, రూరల్ సీఐ పి.ఎన్.డి ప్రసాద్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి మార్గాలు, ప్రవేశ-నిష్క్రమణ ప్రాంతాలు, రద్దీ కూడళ్లు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో వాహనాల రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తున్న నంబర్ ప్లేట్ లేని 11 ద్విచక్ర వాహనాలు, సరైన పత్రాలు లేని 27 వాహనాలు సహా మొత్తం 38 వాహనాలను సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

అదేవిధంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను సేకరించారు. రాత్రి వేళల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు పాత నేరస్థుల కార్యకలాపాలపై కూడా పోలీసులు ఆరా తీశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవి మాట్లాడుతూ, నేర నియంత్రణ, ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

మిర్యాలగూడ పట్టణంలో నేర నియంత్రణ లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు