Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

కోనేరుపల్లెలో భూవివాదం.. ఇరువర్గాలపై కేసు నమోదు..! 

కోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి తమపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారని చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామానికి చెందిన కొలపురి తులసమ్మ పోలీసులను ఆశ్రయించారు.

కోనేరుపల్లెలో భూవివాదం.. ఇరువర్గాలపై కేసు నమోదు..! 

కరీంనగర్, మనసాక్షి :

కోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి తమపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారని చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామానికి చెందిన కొలపురి తులసమ్మ పోలీసులను ఆశ్రయించారు. సర్వే నంబర్ 17, 27, 29, 32 పరిధిలోని తమ భూములకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్లను బేఖాతరు చేస్తూ.. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మరికొందరితో కలిసి భూమిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించారు.

ఈ క్రమంలో జరిగిన దాడిలో తులసమ్మ కుమారుడు రాజనర్సయ్య తలకు, ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ‘డైల్ 100’ సమాచారంతో పోలీసులు స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగ ఇరువురి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చొప్పదండి ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు