Petrol Bunk : పెట్రోల్ బంకుల్లో ఉచితంగా ఈ సేవలు ఉంటాయని మీకు తెలుసా..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులకు అవసరమైన కొన్ని ముఖ్యమైన సౌకర్యాలను కచ్చితంగా ఉచితంగా అందించాలి. ఇంధనం కొట్టించుకున్నా, కొట్టించుకోకపోయినా ఈ సేవలను వినియోగించుకునే హక్కు ప్రతి కస్టమర్‌కు ఉంటుంది.

Petrol Bunk : పెట్రోల్ బంకుల్లో ఉచితంగా ఈ సేవలు ఉంటాయని మీకు తెలుసా..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులకు అవసరమైన కొన్ని ముఖ్యమైన సౌకర్యాలను కచ్చితంగా ఉచితంగా అందించాలి. ఇంధనం కొట్టించుకున్నా, కొట్టించుకోకపోయినా ఈ సేవలను వినియోగించుకునే హక్కు ప్రతి కస్టమర్‌కు ఉంటుంది.
పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు ఉచితంగా లభించే ప్రధాన సదుపాయాల జాబితా :
టైర్లకు ఉచిత గాలి : (Free Air Filling): ఏ వాహనానికైనా (టూ వీలర్, కార్లు తదితర) ఉచితంగా గాలి నింపే సదుపాయం ఉంటుంది.
మంచినీరు (Drinking Water):
కస్టమర్ల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సదుపాయం, క్యారీ బ్యాగులలో లేదా బాటిళ్లలో నీరు పట్టుకునే వెసులుబాటు తప్పనిసరి.
మరుగుదొడ్లు (Washrooms): పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు (టాయిలెట్లు) అందుబాటులో ఉంచాలి. వీటిని ఉపయోగించుకోవడానికి ఎవరూ నిరాకరించడానికి వీల్లేదు.
ప్రథమ చికిత్స పెట్టె (First Aid Kit): అత్యవసర సమయాల్లో గాయాలైనప్పుడు వాడేందుకు బ్యాండేజీలు, ప్రాథమిక మందులతో కూడిన మెడికల్ కిట్ అందుబాటులో ఉంటుంది.
- అత్యవసర ఫోన్ కాల్ (Emergency Phone Call):
- ఫోన్ పనిచేయని లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పెట్రోల్ బంక్ ఫోన్ ద్వారా ఉచితంగా కాల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
- ఫిల్టర్ పేపర్ టెస్ట్ (Filter Paper Test):
- ఇంధనం నాణ్యతను పరీక్షించుకోవాలనుకునే వినియోగదారులు సిబ్బందిని అడిగి ఫిల్టర్ పేపర్ ద్వారా పెట్రోల్/డీజిల్ స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు.
- ఫిర్యాదుల పుస్తకం (Complaint Register):
బంక్ సర్వీసుల్లో లేదా పరిమాణంలో మోసం జరిగినట్లు అనుమానం వస్తే, కస్టమర్లు ఫిర్యాదు చేసేందుకు కంప్లైంట్ రిజిస్టర్ అందుబాటులో ఉంటుంది.మీకు సమీపంలోని పెట్రోల్ బంకులో ఏదైనా సదుపాయం అందలేదా? ఏ సర్వీస్ గురించి అయినా మరింత సమాచారం లేదా ఫిర్యాదు చేసే విధానం ఉంది.(Grievance portal)
పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా …
పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన …
పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన…
పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు …
ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.
- ఇండియన్ ఆయిల్-1800233355
- భారత్ పెట్రోలియం-1800224344
- హెచ్పిసిఎల్-18002333555
- రిలయన్స్-18008919023.
- 1967.1100.1915.112
ఇప్పటికైనా వినియోగదారులు మేలుకోవాలి









