MLA : హౌసింగ్ బోర్డ్ కాలనీలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..!
మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా చేపడుతున్న పలు మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు.

MLA : హౌసింగ్ బోర్డ్ కాలనీలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా చేపడుతున్న పలు మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, మరియు పార్కుల సుందరీకరణ పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎండిఏ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆయన కఠినంగా ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ. “నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌ను, ప్రతి కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా ప్రథమ లక్ష్యం. ప్రజలకు మెరుగైన మరియు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసమే హెచ్ఎండిఏ ప్రత్యేక నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని నిధులు మంజూ చేయిస్తాం” అని పేర్కొన్నారు.
కాలనీ వాసులు తమ దృష్టికి తెచ్చిన మరికొన్ని చిన్న తరహా సమస్యలను సైతం వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ఎమ్మెల్యే పర్యటనతో తమ కాలనీ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ అధికారులు, స్థానిక నాయకులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ సంక్షేమ సంఘం (వెల్ఫేర్ అసోసియేషన్) సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.