Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధం.. 20 లక్షల ఆస్థి నష్టం..!

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధమైన ఘటన మిర్యాలగూడ మండలం తడకమళ్లలో చోటు చేసుకుంది.

Miryalaguda : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధం.. 20 లక్షల ఆస్థి నష్టం..!

మన సాక్షి, మిర్యాలగూడ :

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధమైన ఘటన మిర్యాలగూడ మండలం తడకమళ్లలో చోటు చేసుకుంది. స్థానికులు షాపు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి తడకమళ్ల లోని ఎం ఎన్ ఎస్ ఎంటర్ప్రైజెస్ షాప్ లో విద్యుత్ సర్క్యూట్ తో సామాగ్రి దద్ధమైంది. షాపులోని దుస్తులు, ఎల్ఈడి స్క్రీన్స్ దగ్గమయ్యాయి.

స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పారు. 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా షాపు యజమాని మారం నరసింహస్వామి తెలిపారు. తాను ఎల్ఈడి స్క్రీన్ కోసం 20 లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకుని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్ మేక సైదులు తదితరులు  పరిశీలించారు.

మరిన్ని వార్తలు