Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణ

Miryalaguda : చెరువుకు గండి పడి నీరు వృధా.. వెంటనే పూడ్చాలని ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ ఆదేశం..!

మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం– రుద్రారం, ముల్కల కాల్వ, రాయినిపాలెం, జాలుబాయి తండా గ్రామాల మధ్య గల చెరువుకు గండి పడి చెరువులోని నీరు పూర్తిగా వృథాగా వెళ్లిపోతుంది.

Miryalaguda : చెరువుకు గండి పడి నీరు వృధా.. వెంటనే పూడ్చాలని
ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం– రుద్రారం, ముల్కల కాల్వ, రాయినిపాలెం, జాలుబాయి తండా గ్రామాల మధ్య గల చెరువుకు గండి పడి చెరువులోని నీరు పూర్తిగా వృథాగా వెళ్లిపోతుంది. కాగా సాగునీటి సమస్య ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉందని సమాచారం తెలుసుకున్న
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే ఇరిగేషన్ అధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువుకు పడిన గండిని అత్యవసర ప్రాతిపదికన పూడ్చి, చెరువులోని నీరు వృథాగా పోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా లక్ష్మీపురం– రుద్రారం చెరువు వద్ద శాశ్వత పరిష్కారంగా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, సాగునీటి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు