Nalgonda : ఎన్.జి కళాశాల విద్యార్థుల హవా..!
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరికీ, మరొకరికి కేరళ సెంట్రల్ యూనివర్సిటీ లో సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు.

Nalgonda : ఎన్.జి కళాశాల విద్యార్థుల హవా..!
నల్లగొండ, మన సాక్షి:
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరికీ, మరొకరికి కేరళ సెంట్రల్ యూనివర్సిటీ లో సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు. దోతి నవీన్ కు ఎమ్మెస్సీ గణితశాస్త్రంలో, గోస్కుల అఖిలకు ఎమ్మెస్సీ భౌతికశాస్త్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, కొత్త లోకేష్ కు కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో సీట్లు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల నుండి ఒకేసారి ముగ్గురికి సీట్లు రావడం గర్వకారణమని, దీన్ని జూనియర్ విద్యార్థులు ఆదర్శoగా తీసుకోవాలని అన్నారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల నిరంతర తర్ఫీదు వల్ల విద్యార్థులకు ర్యాంకులు వచ్చాయని ఆయన అన్నారు.
ఈ సందర్బంగా ర్యాంకులు పొందిన విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవి కుమార్, డా. అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. దాసరి మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, భౌతిక శాస్త్ర విభాగ అధ్యక్షులు డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, గణిత శాస్త్ర విభాగ అధ్యక్షులు ఎం. వెంకట్ రెడ్డి, రాజనీతిశాస్త్ర విభాగ అధ్యక్షులు డా. ఎ. మల్లేశం,. తెలుగు విభాగ అధ్యక్షులు డా. వెల్దoడి శ్రీధర్, ఇతర అధ్యాపకులు కోటయ్య, దినేష్, మధుకర్, కనకయ్య, డా. వెంకటేశం తదితర అధ్యాపకులు అభినందించారు.









