Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

చెల్లని నోట్లతో మోసం.. ముగ్గురు వ్యక్తుల అరెస్టు..!

అసలైన 500 నోట్లను పోలి ఉండే పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉపయోగించి ఒక వ్యక్తిని మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటన తుర్కపల్లి లో చోటుచేసుకుంది.

చెల్లని నోట్లతో మోసం.. ముగ్గురు వ్యక్తుల అరెస్టు..!

తుర్కపల్లి, మన సాక్షి :

అసలైన 500 నోట్లను పోలి ఉండే పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉపయోగించి ఒక వ్యక్తిని మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటన తుర్కపల్లి లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి ని నిందితులు నమ్మించి, 1లక్షకు బదులుగా, 2లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపారని,ఆ మాటలను నమ్మిన వ్యక్తి మండలంలోని పల్లెపహాడ్ స్టేజ్ వద్ద నింధితులకు లక్ష రూపాయలు అప్పగించారని, అయితే, ఆ తర్వాత ఆ నోట్ల కట్టలలో పైన కింద కొన్ని అసలైన 500 నోట్లు మాత్రమే ఉంచి,మిగిలినవన్నీ చిన్న పిల్లల ఆట నోట్లుగా ఆయన గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా తుర్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నింధితుల్లో భువనగిరి కి చెందిన ముదురుకోల యాకంబరం, కుంట్లూరు, హయత్ నగర్ చెందిన ముదురుకోల దేవేందర్, మద్దెబోయిన నాగరాజు లను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి పిల్లల ఆట కరెన్సీ నోట్ల 16 కట్టలు,10వేల నగదు, ఒక హీరో హోండా ప్యాషన్ మోటార్ సైకిల్.మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో, ముదురుకోల యాకంబరం గతంలో సుబేదారి మరియు నర్సంపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన నకిలీ కరెన్సీ కేసులలో ప్రమేయం ఉన్న నేరస్తుడని తేలింది.

సదరు నిందితుడు అట్టి కేసులలో అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్ పంపనైనది, ఇటివల జైలు నుండి రిలీజ్ అయి మరల అదే విదమైన నేరాలు చేస్తున్నాడని తుర్కపల్లి ఎస్ఐ తక్యుద్దీన్ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆఫర్లను, లేదా కరెన్సీ మార్పిడి పథకాలను నమ్మవద్దని, అటువంటి అనుమానాస్పద కార్యకలాపాల గురించి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని ప్రజలకు సూచించారు….

మరిన్ని వార్తలు