Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం..!

చైనాలో జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 4×400 మీటర్ల మహిళల రిలేలో ప్రవల్లికకు స్వర్ణం చైనా వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబ బిడ్డ నారిమల్ల ప్రవల్లిక అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

Nalgonda : నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం..!

నారిమల్ల ప్రవలిక దేశానికే గర్వకారణం:…

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్……

చింతపల్లి, మన సాక్షి :

చైనాలో జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 4×400 మీటర్ల మహిళల రిలేలో ప్రవల్లికకు స్వర్ణం
చైనా వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబ బిడ్డ నారిమల్ల ప్రవల్లిక అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

చైనాలోని ఓర్డోస్‌లో జూలై 9 నుంచి 12 వరకు నిర్వహించిన 1వ ఆసియా అథ్లెటిక్స్ అండర్-23 ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో నారిమల్ల ప్రవలిక భారత జట్టు తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా ప్రవలికను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హృదయపూర్వకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
డిండి మండల కేంద్రానికి చెందిన నారిమల్ల రాంబాబు, విజయ దంపతుల కుమార్తె ప్రవల్లిక అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ అథ్లెటిక్స్‌లో ఉన్నత స్థాయికి ఎదిగారు.

ప్రవల్లిక తండ్రి ఇళ్ల నిర్మాణ మేస్త్రిగా పనిచేస్తుండగా, తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేసిన ప్రవలిక నేడు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి బంగారు పతకం అందించి డిండి గడ్డ కీర్తిని ప్రపంచానికి చాటారు. ప్రవలిక చైనాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు ఎమ్మెల్యే అందించిన సహాయంతో స్ఫూర్తి పొందిన ప్రవలికకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు సైతం ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారిని కలిసిన ప్రవలిక భావోద్వేగంతో మాట్లాడుతూ.. సార్.. నేను చైనాలో పోటీలకు వెళ్లే సమయంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను. అలాంటి సమయంలో మీరు చేసిన రూ.లక్ష ఆర్థిక సహాయం నాకు ఎంతో అవసర సమయంలో ఉపయోగపడింది సార్. మీరు అందించిన సహాయం, ప్రోత్సాహం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మన డిండి బిడ్డ ప్రవలిక అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉంది. మన దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, నల్లగొండ జిల్లాకు, ముఖ్యంగా దేవరకొండ ప్రాంతానికి ఆమె పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం అభినందనీయం. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని ప్రవల్లిక తన విజయంతో నిరూపించింది. భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై మరింతగా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

ప్రవలిక క్రీడా భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.త్వరలోనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవలికకు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అలాగే ప్రవలికను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఆమె కోచ్ పసుపుల పరశురాములుకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ దేశానికి గొప్ప క్రీడాకారులను అందించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
ప్రవల్లిక ఇంటర్మీడియట్ విద్యను డిండిలో పూర్తి చేసి, ప్రస్తుతం నల్లగొండ చర్లపల్లిలోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశా ల లో విద్యనభ్యసిస్తున్నారు. డిండి గడ్డ నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగి.. భారతదేశానికి స్వర్ణ పతకం అందించిన నారిమల్ల ప్రవల్లిక నేటి యువతకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు