Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజాతీయం

DGP : త్రిపుర డిజిపి ఆత్మహత్య..!

త్రిపుర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొన్నది. త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అనురాగ్ దన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

DGP : త్రిపుర డిజిపి ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

త్రిపుర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొన్నది. త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అనురాగ్ దన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం అగర్తలలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తన కార్యాలయంలో విగత జీవి గా పడి ఉన్నాడు. గమనించిన సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఉరి వేసుకుని డిజిపి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఉన్నతాధికారులు చేరుకొని పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. రాష్ట్ర పోలీస్ బాస్ ఆత్మహత్య చేసుకోవడంపై పోలీస్ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశం నెలకొన్నది. 1994వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా ఆయన 2025 మే నెలలో లో రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వివిధ హోదాల లో పనిచేశారు.

మరిన్ని వార్తలు