Breaking News : ఏసిబి సోదాలు, ఫేక్ ఫోన్ పే మోసం.. మన సాక్షి టాప్ 10 బ్రేకింగ్ న్యూస్.. ఒకే క్లిక్ తో..!
మన సాక్షి వెబ్ న్యూస్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది జాతీయ అంతర్జాతీయ స్థాయి బ్రేకింగ్ న్యూస్ మీకోసం...

Breaking News : ఏసిబి సోదాలు, ఫేక్ ఫోన్ పే మోసం.. మన సాక్షి టాప్ 10 బ్రేకింగ్ న్యూస్.. ఒకే క్లిక్ తో..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మన సాక్షి వెబ్ న్యూస్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది జాతీయ అంతర్జాతీయ స్థాయి బ్రేకింగ్ న్యూస్ మీకోసం…
—–
ట్రాన్స్‌కో DE నివాసంలో ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ట్రాన్స్‌కో DE ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైటెక్స్ మీనాక్షి స్కై టవర్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ DSP మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతుండగా, ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం.
—–
ఫేక్ ఫోన్ పే స్కామ్.. 97 వేల బంగారంతో నిందితుడు జంప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఘరానా మోసం వెలుగు చూసింది. షాపు యజమానురాలిని నమ్మించి రూ. 97 వేల విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్న ‘రాజేష్’ అనే వ్యక్తి, ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా డబ్బులు పంపినట్లు బురిడీ కొట్టించి బైక్‌పై పరారయ్యాడు.
——-
యోగిని చూసి నేర్చుకోండి: రాజాసింగ్
తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం హత్యలకు అడ్డాగా మారిపోయిందని, రోజుకో మూల దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి క్రైమ్ కంట్రోల్ చేయడం చేతకాకపోతే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి, అక్కడ నేరాలను ఎలా అదుపు చేశారో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.
—–
SIR ఫారం నింపిన సీఎం రేవంత్
తెలంగాణ వ్యాప్తంగా SIR నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకుని BLOలకు అందించారు. ఈ సందర్భంగా ప్రజలు SIR పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇందులో పేరు లేకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలుకు అవగాహన కల్పించాలని సూచించారు.
——
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న CJP ఆందోళన
ఆన్లైన్ యాప్‌ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్న దాతలు.
జంతర్ మంతర్ వద్ద అవసరానికి మించి చేరుకుంటున్న నిత్యావసర సరకులు, ఆహార పదార్థాలు
——
కరీంనగర్ చోరీ కేసు.. అల్లుడిపై అనుమానం
కరీంనగర్లో జరిగిన దొంగతనంపై సీపీ గౌష్ ఆలం స్పందిస్తూ.. బంగారం, నగదు ఉన్న అల్మారా భాగంలోనే చోరీ జరగడంతో అంతర్గత సమాచారం ఆధారంగానే ఇది జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అల్లుడి ప్రమేయంపై విచారిస్తున్నామని తెలిపారు. కేసు ఛేదనకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు.
—–
కరెంట్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ఎదుట రైతుల రాస్తారోకో
- నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా రైతుల ఆందోళన
- సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి – నకిరేకల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి రాస్తారోకో
- కరెంట్ కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని ఆగ్రహం
- కరెంట్ అధికారులు అందుబాటులో ఉండరని, ఫోన్లు ఎత్తరని ఆరోపణ
- మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవాలని డిమాండ్
——
బస్సు ఎత్తుకెళ్లాడు.. మూవీ రేంజ్లో ఛేజ్
TG: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుండి ఓ దుండగుడు TGSRTC బస్సును అపహరించాడు. బస్సును విచక్షణారహితంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొడుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమ వాహనాల్లో సినిమా రేంజ్లో బస్సును సుదీర్ఘంగా ఛేజ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని, బస్సును స్వాధీనం చేసుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
——
పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
ఢిల్లీలోని పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.









