Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : అర్హులైన ప్రతి ఓటు జాబితాలో ఉండాలి..!

అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు జాబితాలో కొనసాగేందుకు కృషి చేయాల్సిన బాధ్యత బీఎల్ఓలు, బీఎల్ఏలపై ఉందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

Suryapet : అర్హులైన ప్రతి ఓటు జాబితాలో ఉండాలి..!

సూర్యాపేట, మనసాక్షి :

అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు జాబితాలో కొనసాగేందుకు కృషి చేయాల్సిన బాధ్యత బీఎల్ఓలు, బీఎల్ఏలపై ఉందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు కౌన్సిలర్ శ్రీవిద్య జ్యోతి కరుణాకర్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. నిజమైన అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగి పోకుండా చూడాలని, అవసరమైన పత్రాలతో ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కోరారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బిఎల్ఓ లను బిఎల్ఎ లను సన్మానించారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దారావత్ వెంకన్న నాయక్ పిల్లలా రమేష్ నాయుడు, దేవేందర్, దామిడి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు