Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. కీలక ఆదేశాలు..!

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని కేజీబీవీ, పీఎం శ్రీ మోడల్ స్కూల్, కాలేజీ, మండల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

District collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. కీలక ఆదేశాలు..!

తుర్కపల్లి, మన సాక్షి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని కేజీబీవీ, పీఎం శ్రీ మోడల్ స్కూల్, కాలేజీ, మండల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, అడ్మిషన్లు, ఉపాధ్యాయుల విధి నిర్వహణ, మధ్యాహ్న భోజనం నాణ్యత, కిచెన్ పరిశుభ్రత, ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత ఉన్న విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. మోడల్ స్కూల్‌లో వెంటనే ఆర్‌బీఎస్‌కే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

14 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి 100 శాతం టీకాలు వేయించాలని డీఈఓను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, కొత్త అడ్మిషన్లపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవికుమార్, ఎంపీడీవో గీతారెడ్డి, ప్రిన్సిపాల్ శోభారాణి, గ్రామ సర్పంచ్ బద్దు నాయక్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు