Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
కూలీల ఆటో బోల్తా… పలువురికి తీవ్రగాయాలు..!
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం శివారులో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

కూలీల ఆటో బోల్తా… పలువురికి తీవ్రగాయాలు..!
నడిగూడెం, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం శివారులో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. రామాపురానికి చెందిన కూలీలు రత్నవరంలో నాటు వేసేందుకు ఆటోలో బయలుదేరారు. రహదారి పనులు జరుగుతూ ఉండటంతో వర్షానికి రహదారిపై గుంతలు పడ్డాయి. దీంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. క్షతగాత్రులను పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.









