Breaking : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం.. వివాహిత దారుణ హత్య..!
వివాహిత యువతి దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.

Breaking : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం.. వివాహిత దారుణ హత్య..!
వెల్దండ, మన సాక్షి:
వివాహిత యువతి దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ళ అనూష (22) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు.అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఒడ్డోని రాళ్ల వద్దకు తీసుకెళ్లి హత్య చేసి ఆపై నిప్పంటించి దహనం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
హత్యకు పాల్పడిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్ ల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.










