Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

శ్రీశైలంలోకి నిలకడగా వరద, నాగార్జున సాగర్ లోకి 76,416 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!

కృష్ణ నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దాంతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు నిలకడగా కొనసాగుతుంది.

శ్రీశైలంలోకి నిలకడగా వరద, నాగార్జున సాగర్ లోకి 76,416 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణ నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దాంతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు నిలకడగా కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215. 810 టీఎంసీలకు గాను ప్రస్తుతం 183.419 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ గట్టు కాగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్ జలాశయంలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పదివేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలోకి 76,416 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనతో 15,450 క్యూసెక్కులన్నిటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయ నీటినిల్వ సామర్థ్యం 312.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 149.641 టీఎంసీల నీరు ఉంది.

మరిన్ని వార్తలు