Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District Collector : పోలీస్ పరేడ్ మైదానం పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక..!

స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంను పరిశీలించారు.

District Collector : పోలీస్ పరేడ్ మైదానం పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక..!

నారాయణపేటటౌన్, మనసాక్షి. :-

స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ ఎండి. రియాజ్ హుల్ హక్ తదితర అధికారులతో కలిసి వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజలు, విద్యార్థులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యార్థులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్టాల్స్ ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, వీఐపీలు, ప్రజలు మరియు విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్ పోలీస్ శాఖ తరఫున చేపట్టిన భద్రతా ఏర్పాట్లను వివరించారు. పరేడ్, ప్రజల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత పోలీస్ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు