Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్నగర్
ధాన్యం నిల్వల్లో తేడాలు.. రైస్ మిల్ యజమాని పై కేసు నమోదు..!
కనకదుర్గ రైస్ మిల్ ఓనర్ ధర్మారం కొట్టం సాయిబాబా రెడ్డి, పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.

ధాన్యం నిల్వల్లో తేడాలు.. రైస్ మిల్ యజమాని పై కేసు నమోదు..!
మహబూబ్నగర్ (నవాబు పేట్) మన సాక్షి
నవాబు పేట్ మండలం తీగలపల్లి గ్రామంలోని శ్రీ కనకదుర్గ పారా బాయిల్డ్ రైస్ మిల్లు ఓనర్ ధర్మారం కొట్టం సాయిబాబా రెడ్డి ఆగస్టు 6న సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా కనకదుర్గ రైస్ మిల్లులో సుమారు 49,149 (1965 మెట్రిక్ టన్నులు) వరి ధాన్యం బ్యాగులు తక్కువగా నమోదయ్యాయి.
పై కొరత విలువ సుమారు 7 కోట్ల 12 లక్షల 65 వేల రూపాయలు ఉంటుందని స్టీల్ సప్లై అధికారులు అంచనా వేయడం జరిగింది. పై కారణంగా సివిల్ సప్లై అధికారులు అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు శుక్రవారం కనకదుర్గ రైస్ మిల్ ఓనర్ ధర్మారం కొట్టం సాయిబాబా రెడ్డి, పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.









