Breaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 20 మంది లైసెన్సులు రద్దు..!
జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన భూముల రిసర్వే కార్యక్రమంలో పాల్గొనని 20 మంది లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 20 మంది లైసెన్సులు రద్దు..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి,
జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన భూముల రిసర్వే కార్యక్రమంలో పాల్గొనని 20 మంది లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా పరిధిలో సర్వేలో ఆసక్తి ఉన్న 129 మంది అభ్యర్థులకు శిక్షణ అందించి, వారికి లైసెన్స్ సర్వేయర్లుగా లైసెన్సులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రిసర్వే కార్యక్రమంలో లైసెన్స్ సర్వేయర్లు భాగస్వామ్యం కావాల్సి ఉన్నప్పటికీ, విధుల్లో పాల్గొనని 20 మంది లైసెన్స్ సర్వేయర్లపై చర్యలు తీసుకుంటూ వారి లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న రిసర్వే కార్యక్రమానికి లైసెన్స్ సర్వేయర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.