Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసింది విద్యార్థులేనా..?

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి చెందిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొన్నది. హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.

Nalgonda : నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసింది విద్యార్థులేనా..?

మన సాక్షి, వెబ్ డెస్క్ :

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి చెందిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొన్నది. హత్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 27 సార్లు కత్తిపోట్లు పొడిచి హత్య చేసింది పదవ తరగతి విద్యార్థులు అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

ఈ హత్య కేసు పోలీసులకు పెద్ద సవాల్ గా మారిన విషయం తెలిసిందే. రూపారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను సుమారుగా 120 మందిని పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. కాగా ఆమెను హత్య చేసిన వారు విద్యార్థులు అని తేలినట్లు తెలుస్తోంది. విద్యార్థులు కేవలం జల్సాల కోసం డబ్బు కోసం ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రెండు లక్షల రూపాయలతో పోరారైన విద్యార్థులు సీసీ కెమెరాలు కనిపించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని హైదరాబాద్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు రూపరెడ్డిని హత్య చేశారు. ఆమె పాఠశాల ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి నిందితులు గోడ దూకి ఇంట్లో చేరి దాక్కున్నారు. ఆమె ఇంటి తాళం తీసి ఇంట్లోకి వెళ్ళగానే ఆమె వెనకాల వెళ్లి వంట గదిలో దాక్కున్నారు. ఆ తర్వాత ఆమె ఫ్రెష్ అయ్యి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే వెనుక నుంచి వచ్చి కత్తితో పొడిచి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనలో ముగ్గురు విద్యార్థులను పోలీసులు ఆరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ముగ్గురిలో ఒకరు అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిగాక మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు