రైతులకు శుభవార్త.. రూ. 27 చెల్లిస్తే చాలు 6000 ఆర్థిక భరోసా..!
రైతులకు భారీ శుభవార్త లభించింది. రైతులు గొర్రెలకు పశు బీమా కల్పిస్తూ ఏ పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం వారు 27 రూపాయలు చెల్లిస్తే 6000 రూపాయల ఆర్థిక భరోసా లభించనున్నది.

రైతులకు శుభవార్త.. రూ. 27 చెల్లిస్తే చాలు 6000 ఆర్థిక భరోసా..!
తుగ్గలి, (మన సాక్షి):
రైతులకు భారీ శుభవార్త లభించింది. రైతులు గొర్రెలకు పశు బీమా కల్పిస్తూ ఏ పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం వారు 27 రూపాయలు చెల్లిస్తే 6000 రూపాయల ఆర్థిక భరోసా లభించనున్నది. కర్నూల్తు జిల్లా తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతుల గొర్రెలకు పశు బీమా కల్పించే ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా రైతులు పెద్ద పులికొండ, చిన్న రంగస్వామిలకు చెందిన గొర్రెలకు ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేసి బీమా నమోదు చేశారు.
పశు బీమా పథకం కింద ఒక్కో గొర్రెకు రూ.6,000 బీమా మొత్తంగా నిర్ణయించారు. ఒక్కో గొర్రెకు రూ.180 ప్రీమియం కాగా, ఇందులో ప్రభుత్వం రూ.153 సబ్సిడీగా భరిస్తుంది. రైతు తన వాటాగా కేవలం రూ.27 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
తక్కువ మొత్తంలో రైతు వాటా చెల్లించడం ద్వారా గొర్రెలకు బీమా రక్షణ కల్పించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో గొర్రెలు మృతి చెందిన సందర్భంలో నిబంధనల ప్రకారం బీమా పరిహారం అందడంతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పశు బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ పశుసంపదకు బీమా రక్షణ కల్పించుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు.









