108 ఆంబులెన్స్‌లో గర్భిణీకి కాన్పు.. తల్లీ, బిడ్డా క్షేమం..!
ఆంబులెన్స్‌లో గర్భిణీకి ముందస్తు ప్రసవమైంది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనంలోనే కాన్పు చేయగా, ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

108 ఆంబులెన్స్‌లో గర్భిణీకి కాన్పు.. తల్లీ, బిడ్డా క్షేమం..!
నేరడుగొమ్ము, మన సాక్షి :
ఆంబులెన్స్‌లో గర్భిణీకి ముందస్తు ప్రసవమైంది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనంలోనే కాన్పు చేయగా, ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. నేరడుగొమ్ము మండల పరిధిలోని పెర్వాల గ్రామానికి చెందిన అనిత (27)కు ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు మరింత తీవ్రమయ్యాయి.
పరిస్థితిని గమనించిన ఈఎంటి రాజు, పైలట్ వెంకటేష్‌లు వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి, సాహసంతో ఆంబులెన్స్‌లోనే నార్మల్ డెలివరీ చేశారు. అనిత క్షేమంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అనంతరం తల్లీబిడ్డలను నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తరలించారు. పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు . సమయానికి స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.









