Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

కర్నూలులో హైకోర్టు బెంచ్‌.. పత్తికొండలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలి..!

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌తో పాటు పత్తికొండలో సబ్‌కోర్టును ఏర్పాటు చేయాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు వై. మధుబాబు డిమాండ్ చేశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌.. పత్తికొండలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలి..!

పత్తికొండ, (మన సాక్షి):

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌తో పాటు పత్తికొండలో సబ్‌కోర్టును ఏర్పాటు చేయాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు వై. మధుబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పత్తికొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అతిథి గృహం నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు న్యాయవాదులు బైక్‌లతో ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజల న్యాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు తగిన న్యాయ, పరిపాలనా ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని తెలిపారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు న్యాయపరమైన వ్యవహారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో సమయం, ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొన్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రాయలసీమ జేఏసీ పిలుపు మేరకు దశలవారీగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

అదేవిధంగా పత్తికొండ డివిజన్‌ కేంద్రంగా ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు ఉన్నప్పటికీ సబ్‌కోర్టు లేకపోవడం వల్ల న్యాయవాదులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధుబాబు తెలిపారు. పత్తికొండలో సబ్‌కోర్టు ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జున, రవిప్రకాష్, నారాయణస్వామి, సురాజ్‌ నబి, రంగస్వామి, రవి, జగదీష్, నెట్టేకల్లు, నరసింహులు, వాసు, సుధాకృష్ణ, భాస్కర్, రాజశేఖర్, అలీ, వీరేష్, మధు, నాగరాజు, నాగభూషణం, శ్రీను, రామంజి, బషీర్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు