Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : సెప్టెంబర్ 3న మిర్యాలగూడలో కేటీఆర్ పర్యటన..!

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సెప్టెంబర్మి 3 న మిర్యాలగూడకు రానున్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి కాలనీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

Miryalaguda : సెప్టెంబర్ 3న మిర్యాలగూడలో కేటీఆర్ పర్యటన..!

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, ఆగస్టు 29, మన సాక్షి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సెప్టెంబర్మి 3 న మిర్యాలగూడకు రానున్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి కాలనీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ్ సింహారెడ్డితో కలిసి పాల్గొని ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేటీఆర్ మిర్యాలగూడకు రావడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావడమేనని తెలిపారు.

ALSO READ సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. వేప చెట్టుతో మొదలైన వివాదం.. ఇద్దరి మృతి..!

రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయానికి అవసరమైన సమయంలో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ,ప్రభుత్వ తీరును ప్రజల సమక్షంలో ఎండగట్టేందుకే కేటీఆర్ పర్యటన జరుగుతోందని పేర్కొన్నారు.

పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, యువత, మహిళలు,పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.

ALSO READ : భూ భారతి చట్టం ద్వార వివాద రహిత భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు..!

3న మిర్యాలగూడలో జరిగే కేటీఆర్ పర్యటనను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా కదిలి విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో అల్గుబెల్లి అమరేందర్ రెడ్డి,చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి,నల్లమోతు సిద్ధార్ధ,దుర్గంపూడి నారాయణ రెడ్డి,ఎండి.యూసుఫ్,ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, అన్నబీమోజు నాగార్జున చారి,ఎండి ఇలియాస్ ఖాన్,ఎండి.మగ్దుం పాషా, పెద్ది శ్రీనివాస్ గౌడ్, మట్టపల్లి సైదులు యాదవ్,

నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, ధనావత్ బాలాజీ నాయక్,కుర్రా సేవ్యా నాయక్,అంగోతు హతిరాం నాయక్,నిమ్మల నవీన్ రెడ్డి, చౌగాని బిక్షం గౌడ్, అమారావతి సైదులు,ఖాజా మొహినుద్దిన్,కొత్త మరేడ్డి, పేరాల కృపాకర్ రావు, పెండ్యాల పద్మ,షహనాజ్ బేగం,కోదాటి రమా, ధూళిపాళ కళావతి, నంద్యాల శ్రీరాం రెడ్డి, బంటు శ్రీనివాస్, ఆయిల వెంకన్న, ధీరావత్ పాచు నాయక్, ఎండి.షోయబ్,వాజీద్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వివిధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు