Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లావిద్య

సీజ్ మాయజాలం.. కార్పొరేట్ స్కూల్ బరితెగింపు..!

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలు బరితెగింపులు, పరాకాష్టకు చేరాయి. విద్యాశాఖ నిబంధనలు తమ జేబులో ఉన్నాయని ధీమాతో కొన్ని విద్యాసంస్థలు ఏకంగా ప్రభుత్వ అధికారులు వేసిన ముద్రలనే తొలగించి ఆటలాడుకుంటున్నారు.

సీజ్ మాయజాలం.. కార్పొరేట్ స్కూల్ బరితెగింపు..!

ప్రభుత్వ సీలును లేపేసిన యాజమాన్యం

ఎవరి వాటాలు ఎంత..?

గోదావరిఖని, మన సాక్షి :

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలు బరితెగింపులు, పరాకాష్టకు చేరాయి. విద్యాశాఖ నిబంధనలు తమ జేబులో ఉన్నాయని ధీమాతో కొన్ని విద్యాసంస్థలు ఏకంగా ప్రభుత్వ అధికారులు వేసిన ముద్రలనే తొలగించి ఆటలాడుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు, అధికారుల ఆదేశాలు తమకేమి అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

విద్యాశాఖ సిబ్బంది వేసిన సీజ్ మాయం చేసిన పాఠశాల :

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల వెలుపల ఓ రహస్య గదిలో భారీగా పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేస్తుండగా స్థానిక ఎంఈఓ గదిని అధికారికంగా సీజ్ చేశారు. నిబంధన ప్రకారం సీజ్ చేసిన గదిని తెరవాలంటే ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఉత్తర్వులు, జరిమానా రసీదులు తప్పనిసరి. కానీ ఇక్కడ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే గదికి వేసి ఉన్న ప్రభుత్వ సీల్ ను దొంగ చాటుగా తొలగించి పాఠశాల ఆ గదిని వాడుకుంటుంది.

ఈ విషయంపై స్థానిక ఎంఈఓ ను వివరణ కోరగా గదిలో అక్రమంగా పుస్తకాలు నిల్వ ఉన్నాయనే ఫిర్యాదు మేరకు గదిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సదరు పాఠశాలకు నోటీస్ ఇచ్చామని, సీజ్ చేసిన గదిని ఓపెన్ చేసుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాత్రం ఎంఈఓ తీసుకోమన్నారు అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంలో స్థానిక అధికారిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు లేకుండానే సేల్ తొలగించారంటే ఈ వ్యవహారంలో వేల రూపాయలు చేతులు మారినట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

కార్పొరేట్ పాఠశాల బరితెగింపు

ప్రభుత్వ అధికారి సీజ్ చేసిన గదిని, దొంగ చాటున సేల్ తొలగించి అందులో ఉన్న పాఠ్య పుస్తకాలను తీసుకెళ్లడం చట్ట విరుద్ధం. వేసిన తాళం వేసినట్టే ఉంది కానీ సీల్ మాత్రం మాయమైంది. అధికారులు సీజ్ చేయడంతో తమ వ్యాపారానికి అడ్డుకట్ట పడిందని, తమ వ్యాపారానికి నష్టాలు వస్తాయని ఉద్దేశంతో బరితెగించి గదికున్న సీల్ ను తొలగించినట్లు తెలుస్తుంది.

తమను ఎవరు ఏమి చేయలేరు అని, తాము ఏమి చేసిన ఏమి కాదనే ధీమాతో యాజమాన్యం వ్యవహారిస్తుంది. పాఠశాల పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

గదిలో ఇంకా పుస్తకాల నిల్వలు..?

గది లో పుస్తకాలు నిల్వలు ఇంకా ఉన్నట్లు సమాచారం. పుస్తకాలు కావాల్సిన విద్యార్థులకు గది తాళం ఓపెన్ చేసి అందులో నుండి తీసుకొచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం సీల్ చేసిన వస్తువులను చట్టపరమైన ప్రక్రియ ముగిసే వరకు సీలువేసి ఉంచాలి. కానీ స్థానిక ఎంఈఓ లిఖిత పూర్వక ఉత్తరం లేకుండా తొలగించడం వెనుక దొంగచాటుగా తరలించే ప్రయత్నం ఉందని స్థానికుల ఆరోపిస్తున్నారు.

ఈ విషయం పై అధికారులు సమగ్ర విచారణ జరిపితే ఎవరి వాటాలు ఎంత అని, కార్పొరేట్ పాఠశాల ఎవరి అండతో ఇంతటి చర్యకు పాల్పడిందిని, మరిన్ని నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని విద్యా నిపుణులు చెబుతున్నారు..

మరిన్ని వార్తలు