Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి మండలంలో అద్దంకి - నార్కట్పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు.

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

వేములపల్లి, మన సాక్షి :

వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులోని రైస్ మిల్లుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో సుమారు (35–40) సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి నార్కట్‌పల్లి– అద్దంకి హైవే దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చుట్టుపక్కల వారు 108 అంబులెన్స్ సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుడి వివరాలు తెలియకపోవడంతో అతడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే వేములపల్లి ఎస్ఐ లేదా 8712670190 నెంబర్ కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

మృతుడి గుర్తింపు : 

మృతుడు మిర్యాలగూడలోని షాబునగర్ కు చెందిన నక్క రవి కుమార్ గా పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు