Miryalaguda : అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించడం దుర్మార్గం..!
తెలంగాణ అసెంబ్లీలో బి ఆర్ ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు శాసన మండలి సభ్యులను అవమానించేలా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Miryalaguda : అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించడం దుర్మార్గం..!
మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ అసెంబ్లీలో బి ఆర్ ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు శాసన మండలి సభ్యులను అవమానించేలా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశమై అసెంబ్లీలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి సాగర్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లిన మహిళా ప్రజాప్రతినిధులను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. మహిళలను గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, తన చర్యల ద్వారా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల తన వైఖరిని బయటపెట్టిందని విమర్శించారు.
మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరిగిన అవమానంపై ప్రభుత్వం వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే వరకు బి ఆర్ ఎస్ పార్టీ మహిళా విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి , అన్నభీమోజు నాగార్జున చారి,పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎండి ఇలియాస్ ఖాన్ , పెద్ది శ్రీనివాస్ గౌడ్ ,ఎండి మగ్ధుం భాష ,చౌగని బిక్షం గౌడ్, ఎండి. మాజిద్ , మాలావాత్ రవీందర్ నాయక్, పోకల రాజు, విక్టర్, గుడిసె దుర్గ ప్రసాద్, ప్రసాద్, జాని, భీమ్లా నాయక్, రాబర్ట్,
మారుతి వెంకట్ రెడ్డి, పెండ్యాల పద్మావతి , ధూళిపాల కళావతి ,కుర్ర చైతన్య, షహనాజ్ బేగం, రూక్షాన, గుడిశ జానకమ్మ, సందేశ్ రజిని, లావుడి అరుణ, జలపాల సునీత, ఆంగోతు హాతిరాం నాయక్ , బారెడ్డి అశోక్ రెడ్డి , జెరిపోతుల రాములు గౌడ్, ధనావత వెంకటేశ్వర్లు నాయక్, కట్ట మల్లేష్ గౌడ్, సైదా నాయక్, రమేష్ నాయక్, మండల్ సైదాచారి, ఎర్రమళ్ళ దినేష్, సిరసనగండ్ల ఈశ్వర చారి,
ఎలుగుబెల్లి నాగరాజు, వినోద్ నాయక్, కొండారపు నాగేశ్వరరావు, దైవ సత్యం, దైద వెంకటేష్, ఎండి.గయాస్, మరి అంజిబాబు, భూక్య రాంబాబు, మాలి రేణుక, బంటు కాత్యాయని, గంటా శ్రావణ్ రెడ్డి ,బెడదూరి శ్రీనివాస్ రెడ్డి, బంటు నాగయ్య, శంకర్ నాయక్, చలికంటి యాదగిరి, కొర్ర చిన్న నాయక్, నూనె మమత మంగ నాయక్ పాల్గొన్నారు.











