Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలు నిరసిస్తూ మిర్యాలగూడలో భారీ ర్యాలీ.. దిష్టి బొమ్మలు దగ్ధం..!

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మిర్యాలగూడలో దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

Miryalaguda : ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలు నిరసిస్తూ మిర్యాలగూడలో భారీ ర్యాలీ.. దిష్టి బొమ్మలు దగ్ధం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మిర్యాలగూడలో దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో భారీ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

సభాపతిగా స్పీకర్ కి ప్రతి సభ్యుడు గౌరవం ఇవ్వాల్సిందే అని స్పీకర్ చైర్మన్ గౌరవించకపోతే మొత్తం సభను అవమానించినట్టే అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, ఇలాంటి భాషను వాడిని ఎమ్మెల్సీ తాతా మధు పై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఎమ్మెల్సీ తాత మధు తీరుపై స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ కేటీఆర్, హరీష్ రావు, తాతా మధుసూదన్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, గాయం ఉపేందర్ రెడ్డి, స్కైలాబ్ నాయక్, పోదిల శ్రీనివాస్, చల్ల అంజిరెడ్డి, తలకొప్పుల సైదులు, దేశిడి శేఖర్ రెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, బెజ్జం సాయి, మొల్లాల అమృత రెడ్డి, కంచుగట్ల లింగయ్య యాదవ్, రావు ఎల్లారెడ్డి, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు