Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

ACB : రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పేట సబ్ రిజిస్ట్రేషన్ 

నారాయణపేట జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఎస్ ఆర్ ఓ లగిశెట్టి వెంకటస్వామి మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ACB : రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పేట సబ్ రిజిస్ట్రేషన్ 

నారాయణపేట టౌన్, మనసాక్షి:-

నారాయణపేట జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఎస్ ఆర్ ఓ లగిశెట్టి వెంకటస్వామి మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జూలైలో జరిగిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో రూ.90 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు డి.ఎస్.పి తెలిపారు.

రూ.50 వేలు ఇప్పటికే ఇచ్చిన బాధితుడు మిగిలిన మొత్తాన్ని మంగళవారం ఇవ్వబోతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. ప్రైవేటు వ్యక్తి నాగరాజు (నగేష్‌) ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ లగిశెట్టి వెంకటస్వామి డబ్బులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు