రైస్ మిల్లులో విజిలెన్స్ సోదాలు.. 6 వేల 26 బస్తాలు మాయం..!
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గూడూరు గ్రామ శివారులో ఉన్న హోం సాయి వెంకటరమణ బాయిలర్ రైస్ మిల్ లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

రైస్ మిల్లులో విజిలెన్స్ సోదాలు.. 6 వేల 26 బస్తాలు మాయం..!
శివంపేట, మన సాక్షి
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గూడూరు గ్రామ శివారులో ఉన్న హోం సాయి వెంకటరమణ బాయిలర్ రైస్ మిల్ లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సుమారుగా రెండు గంటల పాటు రైస్ మిల్లులోని రికార్డుల దాన్యం నిలువలు ఇతర వివరాలను అధికారులు పరిశీలించారు. 2022 -23 సంవత్సరానికి గాను రబి సీజన్లో ప్రభుత్వం సదరు రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం నిలువలకు సంబంధించిన అధికారుల రికార్డులో లను పరిశీలించారు.
సివిల్ సప్లై ఉప తాసిల్దార్ టి నర్సింలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తనిఖీలో లెక్కల ప్రకారం ఉండవలసిన దాన్యం నిల్వలకు మధ్య చాలా తేడా ఉందని సుమారుగా 6 వేల 26 బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించినామని చెప్పారు.
ALSO READ : వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి..!
ప్రభుత్వంకి చెల్లించిన చెల్లించవలసిన టెండర్ ప్లాట్ మొత్తానికి సంబంధించిన 53 లక్షల 31 వేల 606. రూపాయలు జురిమానా విధించినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి నర్సింలు తెలిపారు.
ఈ మొత్తానికి గాను ప్రభుత్వానికి చెల్లించే వలసిందిగా రైస్ మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు. గడుపులోపు డబ్బులు చెల్లించెదెందుకు రైస్ మిల్ యజమాన్యం రాతపూర్వకంగా అంగీకార పత్రం రాసి ఇచ్చిందని కూడా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి నర్సింలు పేర్కొన్నారు. వారి వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.









