మిర్యాలగూడకు చెందిన గణేష్ కుప్పాలకు లండన్ లో చారిత్రాత్మక ఘనత..!
లండన్ నగరానికి సంబంధించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాలలో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) గణేష్ కుప్పాల అందుకున్నారు.

మిర్యాలగూడకు చెందిన గణేష్ కుప్పాలకు లండన్ లో చారిత్రాత్మక ఘనత..!
మన సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :
లండన్ నగరానికి సంబంధించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాలలో ఒకటైన “లండన్ నగర స్వేచ్ఛా పౌరసత్వం” (Freedom of the City of London) గణేష్ కుప్పాల అందుకున్నారు. గణేష్ కుప్పాల నల్గొండజిల్లా మిర్యాలగూడ లోని ఆదిలక్ష్మి, బాలస్వామి దంపతులకు చిన్న కుమారుడు. మిర్యాలగూడ లో పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా లండన్ లో స్థిర పడ్డారు. 16 సెప్టెంబర్ 2026న గణేష్ కుప్పాల ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ “ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్” గౌరవాన్ని అధికారికంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా, చట్టప్రకారం అవసరమైన ప్రతిజ్ఞ (Declaration) చేసి, Dame Susan Carol … మరియు Caroline Louise … సమక్షంలో ఆయనను Freedom of the Cityలో అధికారికంగా చేర్చారు. ఆయన పేరు, Freemen హక్కుల కొనుగోలు మరియు వారి అధికారిక ప్రవేశాలకు సంబంధించిన I అక్షరంతో గుర్తించబడిన అధికారిక రిజిస్టర్ పుస్తకంలో, కింగ్ చార్లెస్ III పాలనలోని 6వ సంవత్సరమైన 16 సెప్టెంబర్ 2026 తేదీన నమోదు చేయబడింది.
లండన్ నగర చరిత్రలో ఎంతో విశిష్టమైన ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల జాబితాలో కింగ్ చార్లెస్ III, క్వీన్ ఎలిజబెత్ II, ఫ్లోరెన్స్ నైటింగేల్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహనీయులు ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా గణేష్ నిలిచినట్లు తెలుస్తుండటం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఇది నిజంగా ఒక చారిత్రాత్మక మైలురాయి. అంతేకాకుండా, తెలంగాణకు, తెలుగు సమాజానికి చెందిన తొలి వ్యక్తిగా గణేష్ ఈ గౌరవాన్ని అందుకుంటున్నారు. ఈ ఘనత తెలంగాణ ప్రజలకు, తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి ఎంతో గర్వకారణం. గణేష్ ఒక గొప్ప గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, తెలంగాణ మరియు తెలుగు సమాజానికి ఒక చారిత్రాత్మక గుర్తింపును తీసుకువచ్చారు.
ALSO READ : ఇంటీరియో బై గోద్రెజ్ తాజా సోఫా క్యాంపెయిన్.. మనకు నచ్చినట్లుగా మార్చుకునే సరికొత్త సౌకర్యం!
ప్రతిష్ఠాత్మకమైన లండన్ సిటీ ఫ్రీడమ్ (Freedom of the City of London) గౌరవాన్ని అందుకున్న గణేష్ కుప్పాల ని పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ ఎంపీ అభినందించారు. అభినందించిన వారిలో.. సీమా మల్హోత్రా ఎంపీ, జస్ అథ్వాల్ ఎంపీ, వెస్ స్ట్రీటింగ్ ఎంపీ, వీరేంద్ర శర్మ – మాజీ UK ఎంపీ ఉన్మారు. గణేష్ ఈ ప్రతిష్ఠాత్మకమైన మరియు చారిత్రాత్మకమైన ఘనతను అభినందిస్తూ వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మీ విజయయాత్ర ఇలాగే కొనసాగుతూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణకు… తెలుగు సమాజానికి… భారతీయ సమాజానికి ఇది నిజంగా గర్వకారణమైన క్షణమని లండన్ నుంచి మట్టారెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ALSO READ : వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి..!










