Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం..!

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై రామసముద్రం మండల అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం..!

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై రామసముద్రం మండల అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతులు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకరించాలని ఎండీఓ కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు