Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!

పెద్దలను ఎదిరించి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువతి మనస్పర్ధల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని ఘట్కేసర్ లో చోటుచేసుకుంది.

Hyderabad : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!

హైదరాబాద్, మన సాక్షి :

పెద్దలను ఎదిరించి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువతి మనస్పర్ధల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని ఘట్కేసర్ లో చోటుచేసుకుంది.

ఘట్కేసర్ ప్రాంతంలోని పోచారం డివిజన్లోని గెలాక్సీ టవర్స్ లో రెండున్నరెళ్ల వయసున్న కవల పిల్లలతో కలిసి వైజాగ్ కు చెందిన రమాకాంత్ శ్రీకాకుళం కు చెందిన మౌనిక సంతోషి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంకులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తుండగా రామకాంత్ ఇన్ఫోసిస్ లో హెచ్ఆర్ గా పనిచేస్తున్నారు.

రోజు మాదిరిగా పనిమనిషి వచ్చి చూడగా మౌనిక ఆత్మ హత్యకు పాల్పడి విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

చిన్నారుల విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు పేర్కొంటున్నారు. దంపతులు మధ్య గొడవ జరిగి మనస్థాపానికి గురైన మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ళ కవల పిల్లలు తల్లిని కోల్పోయి అనాధలు అయ్యారు.

మరిన్ని వార్తలు